ఆడిటర్ విజయసాయిరెడ్డికే తెలుసు
తన సంస్థలలో పెట్టిన పెట్టుబడులకు సంబందించిన సమాచారం అంతా ఆయన ఆడిటర్ విజయసాయిరెడ్డికే తెలుసని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ చెప్పడం ఆసక్తికరంగా ఉంది. తన సంస్థలలో పెట్టుబడులు పెట్టినవారిలో పలువురితో పెద్దగా సంబందాలు లేవని , పొట్లూరి ప్రసాద్ అంతగా తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఇచ్చిన సమాదానాలలో ఈ విషయాలు ఉన్నాయి.నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబందించిన ప్రశ్నలకు మాత్రం ఆయన స్పష్టమైన సమాదానాలు ఇచ్చారు. సాక్షిలో 450 కోట్ల పెట్టుబడి పెట్టారని, అందుకే డైరెక్టర్ పదవి ఆఫర్ ఇచ్చామని ఆయన చెప్పారు. కాగా సిమెంట్ కంపెనీలో 300 కోట్ల పెట్టుబడికి గాను 600 కోట్ల ఆదాయం పొందారని ఆయన వివరించారు.స్థూలంగా జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డికే అన్ని విషయాలు తెలుసు అని జగన్ చెప్పదలిచినట్లుగా ఉంది.అప్పట్లో ఆయనే ఈ పెట్టుబడులు సాదించడంలో కీలక పాత్ర పోషించారని వార్తలు వచ్చాయి
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








